ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ప్రజాప్రతినిధులు బయటకు వస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలం కరస్‌గుత్తిలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కసర్గుత్తి వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ-కర్ణాటక అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను ఆయన పరిశీలించారు. సరిహద్దు వద్ద రాకపోకలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉండాలి : ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి - updated news on mla bhupal reddy toured at Karasagutti in sangareddy district
ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కరస్‌గుత్తిలో పర్యటించారు. సరిహద్దు ప్రాంతాల్లో వాహన రాకపోకలకు అనుమతించవద్దని పోలీసులను ఆదేశించారు.
కరసగుత్తిలో పర్యటించిన ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
అనంతరం స్థానిక తండాల్లో కలియతిరిగి.. స్థానికులతో మాట్లాడారు. కరోనా ప్రబలకుండా ఉండేందుకు ప్రజలంతా లాక్‌డౌన్‌ను పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు.
ఇవీచూడండి:'ఆ పన్నెండు సూత్రాలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం'