సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణ పరిధిలో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గంలో కార్యాలయం మంజూరుకు కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - సంగారెడ్డి డీఎస్పీ కార్యాలయం
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పర్యటించారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
Narayankhed dsp office
ఆరు పోలీసు ఠాణాలు కార్యాలయం పరిధిలోకి వస్తాయని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమం అనంతరం.. డీఎస్పీ సత్యనారాయణ.. ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ ప్రారంభోత్సవంలో ఆయా సర్కిల్ల సీఐలు, ఎస్ఐలు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ప్రైవేట్ ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన విద్యాశాఖ నిర్లక్ష్యం