సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 329 మందికి చెక్కులను అందజేశారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ - ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తాజా వార్తలు
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల పాలిట వరంగా మారాయని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని 329 మంది పథకాల లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
పేదల కుటుంబంలోని ఆడబిడ్డల వివాహాలకు సీఎం కేసీఆర్ అండగా నిలబడుతున్నారన్నారు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకం పేదింటి ఆడబిడ్డల పాలిట వరంలా మారిందని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాఘవరెడ్డి, తహసీల్దార్ దశరత్ సింగ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. కరోనా జాగ్రత్తలు పాటించారు.. అందినకాడికి దోచుకెళ్లారు