తెలంగాణ

telangana

By

Published : Aug 21, 2020, 8:36 PM IST

ETV Bharat / state

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీ కష్టంగా మారింది: హరీశ్‌ రావు

రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం పంపిణీ కార్యక్రమం.. వాటిని నిర్మించడం కన్నా కష్టంగా మారిందని మంత్రి హరీశ్‌ రావు అభిప్రాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో జర్నలిస్టులకోసం నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను మంత్రి ప్రారంభించారు.

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీ కష్టంగా మారింది: హరీశ్‌ రావు
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పంపిణీ కష్టంగా మారింది: హరీశ్‌ రావు

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టడం కన్నా పంపిణీ కార్యక్రమం చాలా కష్టంగా మారిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు అభిప్రాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో జర్నలిస్టుల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి.. జడ్పీ ఛైర్ పర్సన్ మంజుశ్రీ, జహీరాబాద్, ఆందోలు ఎమ్మెల్యేలు మాణిక్ రావు, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ తో కలిసి ప్రారంభించి గృహప్రవేశం చేయించారు.

జహీరాబాద్​లో నిర్మించిన డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్లు

రాష్ట్రంలో సర్కార్ జర్నలిస్టుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని హరీశ్‌ రావు పేర్కొన్నారు. జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా రూ. 100 కోట్ల నిధిని ఏర్పాటు చేసి అన్ని విధాలుగా ఆదుకుంటుందని గుర్తు చేశారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా జహీరాబాద్‌లో జర్నలిస్టులకు ప్రత్యేక కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వడం శుభపరిణామమని తెలిపారు. ఈ సందర్భంగా 889 మంది లబ్ధిదారులకు రూ. కోటి 89 లక్షల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

చెక్కులు పంపిణీ చేస్తోన్న హరీశ్​ రావు

ఇదీ చూడండి:'దట్టమైన పొగల వల్లే లోనికి వెళ్లడం కష్టమవుతోంది'

ABOUT THE AUTHOR

...view details