సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతంలో పర్యటించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు స్థానిక మహిళలతో ముచ్చటించారు. నారాయణఖేడ్ నుంచి సిర్గాపూర్ మండలంలోని బొక్కాసు గ్రామం వెళ్తుండగా దారిలో ఉపాధి హామీ పనికి చేసి తిరిగి వెళ్తున్న మహిళలతో మంత్రి మాట్లాడారు. వారి యోగక్షేమాలు కనుక్కున్నారు. కరోనా వ్యాధి గురించి ప్రజలకు ఎంత అవగాహన ఉందో పరిశీలించారు. అక్కడ గుమిగూడిన వారిని దూరదూరంగా ఉండాలని వారిస్తూనే.. కరోనా వ్యాధి గురించి వివరించారు. వ్యాధి సంక్రమించే విధానాన్ని గ్రామీణ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పారు.
స్థానికులతో.. మంత్రి ముచ్చట్లు
కరోనా అవగాహన, లాక్డౌన్ పర్యవేక్షణలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి హరీష్ రావు స్థానికులతో ముచ్చటించారు.
స్థానికులతో.. మంత్రి ముచ్చట్లు