దుబ్బాక ఉపఎన్నికలో తెరాస ఓటమిని తట్టుకోలేక ఓ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం కొనయిపల్లి గ్రామానికి చెందిన స్వామి మంగళవారం రాత్రి ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. స్వామి మరణ వార్త తెలుసుకున్న మంత్రి హరీశ్ అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బుధవారం ఉదయం స్వామి మృతదేహానికి మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అంతిమ యాత్రలో పాల్గొని పాడే మోశారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. స్వామి కుటుంబాన్ని పార్టీ అన్నివిధాలుగా ఆదుకుంటుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దు: హరీశ్ - minister harish in cremations
దుబ్బాక ఉపఎన్నికలో తెరాస ఓడిపోయిందని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డ స్వామి అంత్యక్రియల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొని పాడెమోశారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కొనయిపల్లికి చెందిన స్వామి తెరాస ఓటమితో ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని... కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దని మంత్రి హరీశ్‌రావు సూచించారు.
కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దు: హరీశ్
రాజకీయాల్లో గెలుపోటముల సహజం. కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దు. స్వామి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. స్వామి కుటుంబానికి ఆర్థిక సాయంగా రూ.2 లక్షలు అందిస్తున్నాం. వారి పిల్లలకు ఉన్నత చదువులు చెప్పిస్తాం. - హరీశ్‌రావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి