అసెంబ్లీలో మాట్లాడితే మైకులు లాగేస్తున్నారని..బయట మాట్లాడేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అరెస్టులు చేస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి నియోజకవర్గానికి గోదావరి నీళ్లు ఇవ్వాలన్న డిమాండ్‌తో నిరాహార దీక్షకు పూనుకున్నారు. దీనికి అనుమతి లేకపోవడం వల్ల దీక్షా స్థలికి వెళ్లే మార్గంలో పోలీసులు జగ్గారెడ్డిని అరెస్ట్ చేసి..కొండాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వరకు అదుపులో ఉంచుకొని... సొంత పూచికత్తుపై విడుదల చేశారు. ప్రజా సమస్యలపై అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి ప్రజల తాగు నీటి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తన పోరాటం కొనసాగిస్తానని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు.
'అసెంబ్లీలో మైకు ఇవ్వరు..బయట మాట్లాడితే అరెస్టులు' - కొండాపూర్ పోలీస్‌స్టేషన్
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో,బయటా గొంతెత్తే పరిస్థితి లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి నియోజకవర్గానికి గోదావరి జలాలను అందించాలని డిమాండ్ చేస్తూ దీక్షకు విఫలయత్నం చేశారు.
తాగు నీటి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నా పోరాటం కొనసాగిస్తా : జగ్గారెడ్డి