సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ సాయి బాబా కాలనీకి చెందిన శ్రీ నారాయణ పాఠశాలలో ప్రవేశాల కోసం బ్యానర్లను ఆయా కూడళ్లలో కట్టారు. అందులో మండల విద్యాధికారి రాథోడ్ ఫోటో ప్రచురించడం వివాదానికి దారి తీసింది. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని బడి బాటలో భాగంగా అధికారులు కృషి చేస్తుంటే మరోపక్క ప్రభుత్వ అధికారి ఫోటోను తమ పాఠశాల చేరికల బ్యానర్లో పెట్టుకోవడం వివాదాస్పదంగా మారింది. ఎంఈవో రాథోడ్‌ను వివరణ కోరగా.. అనుమతి లేకుండా తన ఫోటో చిత్రీకరించారని దీనిపై ఆ పాఠశాలకు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు ఇలాంటి ప్రకటనలు చేయడం చట్టరీత్యా నేరం అని చెప్పారు.
ప్రైవేటు పాఠశాల ప్రకటనలో ప్రభుత్వ అధికారి ఫోటో - private school
ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పించాలని ఓ పక్క బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంటే ఓ ప్రైవేటు పాఠశాల తమ ప్రచారం కోసం ఇచ్చిన ప్రకటనలో మండల విద్యాధికారి ఫోటో ప్రచురించడం వివాదాస్పదమైంది. ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ప్రైవేటు పాఠశాల ప్రకటనలో ప్రభుత్వ అధికారి ఫోటో