తెలంగాణ

telangana

ETV Bharat / state

మతిస్థిమితం లేని వ్యక్తి.. అనుమానాస్పద స్థితిలో మృతి - పటాన్​చెరువు

మతిస్థిమితం లేని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

mentally handicaped person died in a state of suspicion in sangareddy patan cheruvu
మతిస్థిమితం లేని వ్యక్తి.. అనుమానాస్పద స్థితిలో మృతి

By

Published : Jan 18, 2021, 9:22 AM IST

మద్యానికి బానిసైన ఓ మతిస్థిమితం లేని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరువు పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇస్నాపూర్​కు చెందిన సత్యనారాయణ గత కొంతకాలంగా తాగుడుకు అలవాటు పడ్డాడు. 16వ తేదీన రాత్రి సమయంలో ఇంట్లో సోదరుడితో గొడవపడి, రూ. 200ను తీసుకొని మద్యం సేవించడానికి వెళ్లాడు.

మరుసటి రోజు ఉదయం.. అతను రోడ్డుపై చనిపోయి పడి ఉండటం గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. గుండెపోటుతో మృతి చెంది ఉండొచ్చని మృతుడి బంధువులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: వృద్ధురాలి అనుమానాస్పద మృతి.. ఆస్తి తగాదాలే కారణమా?

ABOUT THE AUTHOR

...view details