తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచు మనోజ్​@ నారాయణఖేడ్​ మున్సిపాలిటీ - narayanakhed

సినీ నటుడు మంచు మనోజ్​ పేరు నారాయణఖేడ్​ పురపాలక సంఘం ఓటరు జాబితాలో ప్రత్యక్షమైంది. తప్పుల తడకగా ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మంచు మనోజ్​@ నారాయణఖేడ్​ మున్సిపాలిటీ

By

Published : Jul 16, 2019, 3:22 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ పురపాలికను అధికారులు 15 వార్డులుగా విభజించి ఓటరు జాబితా తయారు చేశారు. రెండో వార్డులో సీరియల్​ నంబర్​ 428లో మంచు మనోజ్​ పేరు చూసి స్థానికులు అవాక్కయ్యారు. అంతేకాకుండా చనిపోయినవారి పేర్లు జాబితా నుంచి తొలగించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. ఇటీవల జడ్పీటీసీగా గెలిచిన రవీందర్​ నాయక్​ ర్యాకేల్​ గ్రామంలో ఓటు హక్కు ఉంది. ఇప్పుడు మాత్రం పట్టణంలోని ఏకంగా మూడు వార్డుల్లో పేరు ఉంది. అతేకాకుండా తెరాస గ్రామ నాయకుల పేర్లు కూడా మున్సిపాలిటీ పరిధిలో ఉండటాన్ని వ్యతిరేకిస్తూ పలు పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. సవరించిన తర్వాతే తుది జాబితా ప్రచురించి, ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్​ చేస్తున్నారు.

మంచు మనోజ్​@ నారాయణఖేడ్​ మున్సిపాలిటీ
మంచు మనోజ్​@ నారాయణఖేడ్​ మున్సిపాలిటీ

ABOUT THE AUTHOR

...view details