సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఘనపూర్ శివారులో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఘనపూర్ నుంచి పాటి గ్రామానికి వెళ్లే రహదారిలో మల్లన్న గుడి పక్కన పొలంలో దాదాపు 35 సంవత్సరాల వయసు గల వ్యక్తి చనిపోయి ఉన్నాడు. ఐదు రోజుల కింద చనిపోవడం వల్ల మృతదేహం పాడైపోయింది. అతన్ని ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేశారా లేక అతనే ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి - murder
గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటన సంగారెడ్డి జిల్లా ఘనపూర్లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పోలీస్ స్టేషన్