సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చిరు వ్యాపారులకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు రుణ మంజూరి పత్రాలు పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా రెక్కాడితే కాని డొక్కాడని చిరు వ్యాపారులకు ఈ రుణాలు ఇస్తున్నామని తెలిపారు. ఈ రుణాన్ని వ్యాపార అభివృద్ధికి వినియోగించుకోని సకాలంలో బ్యాంకులకు తిరిగి చెల్లించాలన్నారు. క్రెడిట్ లిమిట్ పెంచుకోవాలని మంత్రి వారికి సూచించారు. ప్రస్తుతం 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు.
చిరు వ్యాపారులకు రుణాలు.. పత్రాలు అందించిన హరీశ్‌రావు - చిరు వ్యాపారులకు రుణాలు అందజేసిన రాష్ట్ర ఆర్థిక మంత్రి
కరోనా వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న చిరు వ్యాపారులకు సూక్ష్మ రుణాలు సబ్సిడీపై ఇస్తున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మంత్రి వ్యాపారులకు ఆయన రుణ మంజూరి పత్రాలు అందజేశారు.
ఇబ్బందుల్లో ఉన్న చిరు వ్యాపారులకు రుణాలు
ప్రతి చిరువ్యాపారికి రుణం అందేలా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంగారెడ్డి పురపాలిక సంఘానికి 30 చెత్త తరలింపు ఆటోలు అందజేశారు. ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా ప్రత్యేక వార్డును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఇదీ చూడండి :ఉద్యాన పంటల సాగుపై సర్కార్ ప్రత్యేక దృష్టి