తెరాస నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు గెలిచినా.. ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూముల రక్షణ కోసం సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం చింతలగట్టులోని అంబేడ్కర్ భవన్ వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిరాహార దీక్ష చేపట్టారు. మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హక్కులు కాపాడుకుందాం: మందకృష్ణ మాదిగ - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు
ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూముల రక్షణ కోసం సంగారెడ్డి జిల్లా చింతలగట్టులోని అంబేడ్కర్ భవన్ వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హక్కులు కాపాడుకుందాం: మందకృష్ణ మాదిగ
అల్ప కులాలకు చెందిన వారిని రాజకీయంగా అణచి వేస్తున్నారని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. హక్కులు కాపాడుకుందామని పిలుపునిచ్చారు. దీక్షలో ఎమ్మార్పీఎస్ నాయకులు గీత, బుచ్చిరాంలు, శివరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మందకృష్ణ మాదిగ