సంగారెడ్డి జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి చెరువులు నిండుకుండల్లా మారాయి. గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి అలుక చెరువు, వీరన్న చెరువు, పటాన్ చెరు మండలంలోని లక్డారం గ్రామ శివారులోని పెద్ద చెరువులు నిండాయి. దీంతో అలుగులపై నుంచి నీరు పారుతోంది.
నిండుకుండలని తలపిస్తున్న చెరువులు
సంగారెడ్డి జిల్లాలో చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి జలకళను సంతరించుకున్నాయి. దీంతో అలుగులపై నుంచి నీరు పారుతోంది.
నిండుకుండలని తలపిస్తున్న చెరువులు
గుమ్మడిదల మండలంలో 92.78శాతం వర్షపాతం నమోదవగా, పటాన్ చెరులో 44.8శాతం నమోదయింది. రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయేమోనని రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. వానకి పంటల పరిస్థితి గురించి రైతులని వ్యవసాయ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు.
ఇదీ చూడండి:రాష్ట్ర కేడర్‌కు కేటాయించిన ఐఏఎస్‌లకు పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం