తెలంగాణ

telangana

ETV Bharat / state

అమీన్​పూర్​లో చోరీ... ప్రతిఘటించిన మహిళ హత్య - lady murder

కొన్ని రోజులుగా ఆ ఇంటిపై ఓ కన్నేసి ఉంచారు. భర్త పనిమీద బయటకు వెళ్లగానే భార్య ఒక్కతే ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించారు. ఎలాగైనా ఆ ఇళ్లు దోచేయాలని వ్యూహం రచించారు. సమయం దొరకగానే ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి హతమార్చి ఇంట్లోని బంగారు ఆభరణాలు దోచుకుపోయారు.

అమీన్​పూర్​లో చోరీ... ప్రతిఘటించిన మహిళ హత్య

By

Published : Jun 15, 2019, 11:03 AM IST

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లోని సాయివాణినగర్​లో గత మూడేళ్లుగా సురేందర్​గౌడ్​, అతని భార్య అరుంధతి నివాసం ఉంటున్నారు. భర్త ఉద్యోగ నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో మహిళ ఒంటరిగా ఉంటుంది.

అమీన్​పూర్​లో చోరీ... ప్రతిఘటించిన మహిళ హత్య

ప్రతిఘటించడంతో హత్య

కొన్ని రోజులుగా అది గమనించిన కొందరు దుండగులు వెనక దర్వాజ నుంచి ఇంట్లోకి ప్రవేశించారు. ఆమె కళ్లలో కారం చల్లి ఆభరణాలు దోచుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడం వల్ల దాడి చేసి హతమార్చారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. రెక్కీ నిర్వహించి తెలిసినవారే ఈ పని చేసుంటారని అనుమానిస్తున్నారు.

ఇదీ చూడండి : యాదాద్రి పేరు విశిష్టత ఇదే..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details