2014 ఎన్నికల్లో 280కి పైగా సీట్లు సాధించిన భాజపాకు ఈసారి150 స్థానాలుకూడా రావనితెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ కూడా ఏ మాత్రం పుంజుకోలేదన్నారు. కేవలం ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించిన సత్తా సీఎం కేసీఆర్‌దని... అలాంటి ముఖ్యమంత్రికి 16 మంది ఎంపీలను ఇస్తే...ప్రాజెక్టులకుజాతీయ హోదా తెస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
"దిల్లీ మెడలు వంచే సత్తా కేసీఆర్‌దే" - cm
రోజురోజుకు మోదీ గ్రాఫ్ పడిపోతుందని జహీరాబాద్ సభలో కేటీఆర్ ఆరోపించారు. దిల్లీలో భాజపా, కాంగ్రెస్ కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని విమర్శించారు.
మోదీపై విమర్శలు చేస్తున్న కేటీఆర్