ఓటు వేసిన జగ్గారెడ్డి, గీతారెడ్డి - congress
లోక్సభ ఎన్నికల పోలింగ్ సంగారెడ్డిలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలతో పాటు నేతలు కూడా ఓటు వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటేసిన గీతారెడ్డి, జగ్గారెడ్డి
సంగారెడ్డి కేంద్రంలోని రామ మందిర్ నూతన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓటుహక్కు వినియోగించుకున్నారు. మాజీ మంత్రి గీతారెడ్డి కూడా సంగారెడ్డిలో ఓటు వేశారు. ఓటు వేసేందుకు సహచరులతో కలిసి వచ్చారు. అందరూ ఓటు వెయ్యాలని సూచించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 280 పోలింగ్ కేంద్రాలకు గాను.. 1700మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.