ఆచూకీ చెప్పిన వారికి 2 లక్షలు: జగ్గారెడ్డి - baby
సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పాప అదృశ్యమై 3 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించలేదు. చిన్నారి వివరాలు చెప్పిన వారికి తన వేతనం నుంచి రూ. 2 లక్షలు ఇస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. పాప కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పరామర్శిస్తున్న జగ్గారెడ్డి
సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పాప అదృశ్యం కేసులో ఎనిమిది పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇంత వరకు చిన్నారి వివరాలు తెలియరాలేదు. పాప ఆచూకీ తెలిపిన వారికి తన వేతనం నుంచి రూ. 2 లక్షలు ఇస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎవరు అధైర్యపడొద్దని.. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.