తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగిసిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు - అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో జరిగిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు ముగిశాయి. ఫైనల్ పోరులో హైదరాబాద్‌కు చెందిన ముస్తఫా పహిల్వాన్, మహారాష్ట్రకు చెందిన బైమాడి పహిల్వాన్ హోరాహోరీగా తలపడగా.. న్యాయనిర్ణేతలు ఇరువురిని విజేతలుగా ప్రకటించారు.

Interstate wrestling competitions succesfully ended in zahirabad
ముగిసిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు

By

Published : Mar 1, 2021, 9:53 AM IST

తెలంగాణ మల్లయోధుల సమాఖ్య ఆధ్వర్యంలో.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో జరిగిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు విజయవంతంగా ముగిశాయి. పట్టణానికి చెందిన మల్లయోధుడు అలీ అహ్మద్ పహిల్వాన్ పర్యవేక్షణలో.. మధ్యాహ్నం నుంచి రాత్రివరకూ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఫైనల్ పోరులో హైదరాబాద్‌కు చెందిన ముస్తాఫా పహిల్వాన్, మహారాష్ట్రకు చెందిన బైమాడి పహిల్వాన్ హోరాహోరీగా తలపడగా.. న్యాయనిర్ణేతలు ఇరువురిని విజేతలుగా ప్రకటించారు.10 వేల నగదుతో పాటు వారికి ట్రోఫీ బహుకరించారు.

ఈ పోటీల్లో ఉమ్మడి మెదక్, హైదరాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలువురు మల్లయోధులు పాల్గొన్నారు. ఆటను తిలకించేందుకు ప్రేక్షకులు భారీ ఎత్తున తరలివచ్చారు.

ఇదీ చదవండి:ఎమ్మెల్సీ ఎన్నికలు.. అధికార, విపక్ష పార్టీల వ్యూహాలు

ABOUT THE AUTHOR

...view details