సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ బాలికల పాఠశాల ఆరో తరగతి గదిలో పెచ్చులూడి ఒక విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. రెండేళ్ల క్రితమే నిర్మించిన భవనం అయినప్పటికీ నాసిరకం నిర్మాణం వల్ల ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయురాలు పాఠాలు చెబుతుండగా... అకస్మాత్తుగా పెచ్చులూడి హర్ష అనే విద్యార్థిని తలపై పడింది. విద్యార్థులు భయభ్రాంతులకు గురై తరగతి గది నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రధానోపాధ్యాయురాలు సవిత వెంటనే గాయపడ్డ విద్యార్థినిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినట్లు తెలిపారు.
పైకప్పు పెచ్చులూడి విద్యార్థినికి గాయాలు - student
ప్రభుత్వ బాలికల పాఠశాలలో గది పైకప్పు పెచ్చులూడి ఒక విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఉలిక్కిపడ్డ విద్యార్థులు ఒక్కసారిగా తరగతి గది నుంచి బయటకు పరుగులు తీశారు.
గది పెచ్చులూడి విద్యార్థినికి గాయాలు