మహిళల సమస్యలను దృష్టిలో ఉంచుకొని సంగారెడ్డి జిల్లాలోని పాత డీఆర్డీఏ కార్యాలయంలో జిల్లా జెండర్ కాల్ సెంటర్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి సాయి రమాదేవి, జడ్పీ ఛైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డిలు హాజరయ్యారు.
'ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఫోన్ చేయండి' - జెండర్ కాల్ సెంటర్
మహిళలపై జరుగుతున్న వేధింపులు, సమస్యల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో జెండర్ కాల్ సెంటర్ను ప్రారంభించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే ఫోన్ చేస్తే పరిష్కరిస్తామని నిర్వాహకులు తెలిపారు.
'ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఫోన్ చేయండి'
మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఫోన్ చేసి సమస్యలను చెబితే వాటిని పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కేంద్రం ఏర్పాటు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి :'అలా చేస్తే సీఎం కేసీఆర్ ఇరుకున్నట్లే'