సింగూర్ నుంచి 16 టీఎంసీల నీటిని తరలించి.. సంగారెడ్డి జిల్లా ప్రజలకు తాగునీరు లేకుండా చేశారని మాజీ మంత్రి హరీశ్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. ఎలాంటి అవగాహన లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. గత కొంత కాలంగా తనపై విమర్శలు చేస్తున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.. ఆనాడు నీటి తరలింపును ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు.
'హరీశ్‌కు అవగాహన లేదు'
సింగూర్ నుంచి నీటిని తరలించి మాజీ మంత్రి హరీశ్ అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలకు తాగునీరు ఎలా అందిస్తారని ప్రశ్నించారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి