కరోనా మహమ్మారి దెబ్బకి బాబా ఆలయాల్లో గురుపూర్ణిమ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. భక్తులు లేక సాయి ఆలయాలు వెలవెలబోతున్నాయి. సంగారెడ్డి నియోజకవర్గంలోని సాయిబాబా ఆలయాల్లో మందకొడిగా గురుపూజోత్సవం అర్చనలు జరిగాయి.
కరోనా ఎఫెక్ట్: నిరాడంబరంగా గురుపూర్ణిమ వేడుకలు
సంగారెడ్డిలోని బాబా ఆలయాల్లో నిరాడంబరంగా గురుపూర్ణిమ వేడుకలను నిర్వహించారు. కరోనా మహమ్మారి కారణంగా ఆలయాల్లో భక్తుల సందడి కరవైంది.
కరోనా ఎఫెక్ట్: నిరాడంబరంగా గురుపూర్ణిమ వేడుకలు
భక్తులకు ఆలయంలోకి ప్రవేశించే ముందే ఆలయ నిర్వాహకులు శానిటైజర్స్ ఏర్పాటు చేశారు. భక్తుల టెంపరేచర్ చూసిన తర్వాతే ఆలయంలోనికి ప్రవేశం ఇస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని బాబాను ప్రార్థిస్తున్నారు.
ఇవీ చూడండి:కరోనా చికిత్సపై భయం... నమ్మకం పెంచే పనిలో ప్రభుత్వం