పర్యావరణ పరిరక్షణలో భాగంగా రంగారెడ్డి జిల్లా నిజాంపేటకు చెందిన విజ్ఞాన్ పాఠశాల విద్యార్థులకు ప్రహారీ ట్రస్ట్ సంస్థ వారు విత్తన బంతులతో అడవులను ఏ విధంగా పెంచాలో అవగాహన కల్పించారు. విత్తనాలను ఎరువులతో కలపి ముద్దగా చేసి... తడి ఆరాక..పెంచాలనుకునే ప్రదేశంలో విసిరేసినచో... వర్షానికి ఆ బంతులు నీటిని తీసుకుని మెుక్కగా తయారవుతాయని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అడవుల పెంపకానికి ఇది సులువైన విధానమని వివరించారు.
విత్తన బంతులతో మెుక్కల పెంపకం
మెుక్కల ఆవశ్యకతను తెలియజేసేందుకు రంగారెడ్డి జిల్లా విజ్ఞాన్ పాఠశాల విద్యార్థులకు ప్రహారీ ట్రస్ట్ వారు విత్తన బంతులతో మెుక్కలను ఎలా పెంచాలో అవగాహన కల్పించారు. అడవులను పెంచడానికి ఇది ఒక వినూత్నమైన విధానమని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
విత్తన బంతులతో మెుక్కల పెంపకం