సంగారెడ్డిలో కృష్ణాష్టమి ఉత్సవాలను బ్రహ్మకుమారీలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాఠశాలల విద్యార్థులు కృష్ణా, గోపికల వేషాధారణలతో ఆకట్టుకున్నారు. అదే విధంగా సంప్రదాయ నృత్యాలు చేస్తూ... అందరిని విశేషంగా అలరించారు. కృష్ణాష్టమి వేడుకలను బ్రహ్మ కుమారీల ఆధ్వర్యంలో ఏటా ఎంతో వైభవంగా నిర్వహిస్తామని సంగారెడ్డి బ్రహ్మకుమారీల ఇంఛార్జీ సుమంగళి పేర్కొన్నారు.
బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు - కృష్ణాష్టమి వేడుకలను
శ్రీ కృష్ణ, గోపికల వేషాధారణలతో పాఠశాలల విద్యార్థులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నృత్య ప్రదర్శనలు చేశారు.
బ్రహ్మ కుమారీల ఆధ్వర్యంలో ఏటా ఎంతో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు