సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. భేటీలో అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతూ అధికారులకు కాల్చేసినా ఎత్తడం లేదని ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. సమస్య విన్నవించుకోవడానికి అధికారులు సమయం ఇస్తేనే ప్రజాసమస్యలు తీరుతాయన్నారు.
'ప్రజాసమస్యలు తీర్చడంలో అలసత్వం వహించొద్దు'
ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు జాప్యం వహిస్తున్నారంటూ కొందరు ప్రజాప్రతినిధులు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లాలోని జెడ్పీ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పలువురు అధికారులు, ప్రజానేతలు తమ పరిధిలోని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
'ప్రజాసమస్యలు తీర్చడంలో అలసత్వం వహించొద్దు'
గ్రామాల్లో నీటి సమస్యలు తొందరగా తీర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులకు పలు సూచనలు సలహాలు అందించారు. ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఇదీ చూడండి:వృద్ధులకు కరోనా భయం.. అవగాహన అవసరం