సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తెలంగాణలోని సంప్రదాయ వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు. ప్రదర్శించిన వంటకాలు అందరినీ అమితంగా ఆకట్టుకున్నాయి.
డిగ్రీ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ - నారాయణఖేడ్ ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాల
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరిగింది. విద్యార్థులు తయారుచేసిన 40కి పైగా తెలంగాణ వంటకాలను ప్రదర్శించారు.
డిగ్రీ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్
రాష్ట్ర వంటలైన పోలెలు, తైదా లడ్డులు, అంబలి, మిర్చి బజ్జీలు, తదితర 40కి పైగా వంటకాలను తయారు చేశారు. విద్యార్థులు తయారు చేసిన వంటలను పలువురు విద్యార్థులు కొనుగోలు చేసి తిన్నారు.
ఇదీ చూడండి :'మా బిడ్డను మాకు అప్పగించండి'