సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు తెరాస ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని.. రైతుల సంక్షేమం కోసమే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని తెలిపారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే - నారాయణఖేడ్ వార్తలు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు స్థానికఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఎరువులు పంచారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. రైతు సంక్షేమం కోరుకొని రైతుల పక్షాన నిలబడుతుందని ఆయన అన్నారు.
రైతులకు ఎరువుల పంపిణీ
రైతుబంధు, రైతు భీమా, రైతు రుణమాఫీ తదితర రైతు సంక్షేమ పథకాలు నిర్విరామంగా అమలు చేస్తూ.. దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. రైతు బంధు నిలిపివేస్తారన్న ప్రచారాలు కేవలం పుకార్లని.. విపక్షాలు కావాలని ప్రచారం చేస్తున్నాయని రైతులు, ప్రజలు విపక్షాల మాటలు నమ్మొద్దని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి:పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?