సంగారెడ్డి రెవెన్యూ కార్యాలయం ఆవరణలో... మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లికి చెందిన గడ్డం ప్రసాద్ అనే రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారులు తన భూమి పట్టా పాసుపుస్తకంలో నమోదు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తానన్న తహసీల్దార్ స్వామి హామీతో ప్రసాద్ శాంతించాడు.
భూమి పట్టా కోసం రైతు ఆత్మహత్యాయత్నం - farmer sucide attempt
తన భూమి పట్టా పాసు పుస్తకంలో నమోదు చేయడం లేదంటూ... సంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ప్రసాద్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. రెండు రోజుల్లో న్యాయం చేస్తానన్న తహసీల్దార్ హామీతో శాంతించాడు.
భూమి పట్టా కోసం రైతు ఆత్మహత్యాయత్నం
రెండు సంవత్సరాలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి విసుగు చెంది ఆత్మహత్యకు యత్నించినట్లు ప్రసాద్ తెలిపాడు. రెండు రోజుల్లో న్యాయం చేయకపోతే ఊహించని ఘటనకు పాల్పడతానన్నాడు. ఇరు వర్గాలకు నోటీసులు ఇచ్చామని... నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేస్తామని తహసీల్దార్ స్పష్టం చేశాడు. సమస్యలు ఉంటే తమతో సంప్రదించి పరిష్కరించుకోవాలి కానీ... ఎవరు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దని కోరారు.
ఇదీ చూడండి:విలువలు, విశ్వసనీయతే మా బలం: ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి