తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాణం మీదికొచ్చిన చిన్నపాటి గొడవ - family attack on another family in sangareddy district

చిన్నపాటి వివాదం రెండు కుటుంబాల మధ్య కత్తులు, రాడ్లతో దాడి చేసుకునే వరకు వచ్చింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బండ్లగూడలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

family attack on another family in sangareddy district
ప్రాణం మీదుకొచ్చిన చిన్నపాటి గొడవ

By

Published : Dec 19, 2019, 11:41 PM IST

సంగారెడ్డి జిల్లా బండ్లగూడలో ఇమ్రాన్ ఖాన్, అంజద్ ఖాన్ కుటుంబాలు ఒక ఇంటిని రెండు భాగాలుగా పంచుకుని ఉంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు అంజద్ ఖాన్ తరుఫు వారు కనబడకుండా మధ్య భాగంలో చెక్క అడ్డు పెట్టుకున్నారు. ఆగ్రహించిన అంజద్ ఖాన్ కుటుంబ సభ్యులు ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు.

కత్తులు, రాడ్లతో దాడి

మాటామాట పెరిగి రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అంజాద్ ఖాన్ కుటుంబ సభ్యులు, ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులపై రాడ్లు, కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో మెహరున్నీసా, గోరి, రేష్మకు తీవ్ర గాయాలుకాగా.. ఇమ్రాన్ ఖాన్, సల్మాన్ ఖాన్​ స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని పటాన్​చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రాణం మీదుకొచ్చిన చిన్నపాటి గొడవ

ఇవీచూడండి: హైదరాబాద్​లో 'పౌర' సెగ: వామపక్ష నేతల అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details