సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని గారిడేగామ శివారులో జిల్లా ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. పది ఎకరాల పత్తి పొలంలో అంతరపంటగా గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు వచ్చిన సమాచారంతో తనిఖీలు చేశామని జిల్లా ఏఈఎస్ గాయత్రి దేవి తెలిపారు. గంజాయి పొలంలోని 6 వేల 200 మొక్కలను ధ్వంసం చేశారు. వాటి విలువ దాదాపు రూ. 10 లక్షల వరకు ఉంటుందన్నారు. నిందితుల వివరాలు ఇంకా తెలియరాలేదన్నారు. ఈ దాడుల్లో 30 మంది సిబ్బంది పాల్గొన్నారు.
6, 200 గంజాయి మొక్కలు ధ్వంసం
సంగారెడ్డి జిల్లా గారిడేగామలో ఎక్సైజ్, టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. పది ఎకరాల పత్తి పొలంలో అంతరపంటగా పెంచిన 6 వేల 200 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు.
6, 200 గంజాయి మొక్కలు ధ్వంసం