తెలంగాణ

telangana

ETV Bharat / state

డబుల్​ బెడ్​రూం ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు - greater hyderabad

గ్రేటర్ హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు సర్కిల్ పరిధిలో 7 రోజుల పాటు రెండు పడక గదుల ఇళ్ల కోసం 17096 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారని ఉపకమిషనర్ బాలయ్య తెలిపారు.

double bed room houses applications in sangareddy district
డబుల్​ బెడ్​రూం ఇళ్ల కోసం భారీగా దరఖాస్తులు

By

Published : Sep 18, 2020, 11:07 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు సర్కిల్ పరిధిలో రెండు పడక గదుల ఇళ్ల కోసం గ్రేటర్ యంత్రాంగం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు కోరింది. ఈ నేపథ్యంలో ఈనెల 10 నుంచి 18 వరకు మూడు డివిజన్ల పరిధిలోని 15 కేంద్రాల్లో లబ్ధిదారుల నుంచి రెవెన్యూ సిబ్బంది దరఖాస్తులు స్వీకరించారు. ఏడు రోజులపాటు నిర్వహించిన ఈ కేంద్రాల్లో 17, 096 మంది లబ్ధిదారులు రెండు పడక గదుల ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నారని గ్రేటర్​ అధికారులు తెలిపారు. వీటినన్నింటిని పటాన్​చెరు సర్కిల్ కార్యాలయంలో భద్రపరచాలని ఆయన చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో అసలైన లబ్ధిదారులు ఎవరు ఉన్నారనేది విచారణలో తెలుసుకుంటామని ఉపకమిషనర్ బాలయ్య తెలిపారు.


ఇవీ చూడండి:గ్రేటర్​ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం

ABOUT THE AUTHOR

...view details