తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఏమిచ్చినా రుణం తీరదు.. ఇది చిరు సాయం' - SANITATION WORKERS

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, గోకుల్ బస్తీలోని నిరుపేదలకు బియ్యం సహా కిరాణా వస్తువులు పంపిణీ చేశారు.

పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రిలో కిరాణా సరుకుల పంపిణీ
పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రిలో కిరాణా సరుకుల పంపిణీ

By

Published : May 1, 2020, 1:13 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరు ప్రభుత్వాస్పత్రిలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు 50 మందికి బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు శంకర శ్రీనివాస్, వైద్యులు, ఐలా కార్యవర్గ సభ్యులు సంయుక్తంగా సరుకుల వితరణ నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికుల శ్రమకు ఎంత సాయం చేసినా తీర్చలేమంటూ దాతలు కొనియాడారు. గోకుల్ బస్తీలో తెరాస నేత మెట్టు కుమార్ యాదవ్ సౌజన్యంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సతీమణి యాదమ్మ కిరాణా సామగ్రి అందించారు.

ABOUT THE AUTHOR

...view details