తెలంగాణ

telangana

ETV Bharat / state

40 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాబోతుంది: సీఎస్

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సీఎస్ సోమేశ్ కుమార్ పర్యటించారు. టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహా రెడ్డితో కలిసి ఎయిర్ వాటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను సందర్శించారు. ఈ పరిశ్రమతో రాష్ట్రానికి అదనంగా మరో 40 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందుబాటులోకి రానుందని తెలిపారు.

cs somesh kumar
సీఎస్ సోమేశ్ కుమార్

By

Published : May 25, 2021, 10:39 PM IST

రాష్ట్రంలో ఇప్పటివరకు 125 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అయిందని సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ఆధునికీకరించిన ఎయిర్ వాటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమతో.. అదనంగా మరో 40 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రెండు రోజుల్లో అందుబాటులోకి రానుందని తెలిపారు. టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహా రెడ్డితో కలిసి పరిశ్రమను సందర్శించారు.

గ్రీన్​ కో సంస్థ.. 2014 నుంచి ఒక్క మెట్రిక్ టన్ను కూడా ఉత్పత్తి లేని పరిశ్రమను తీసుకుని... నెల రోజుల్లో అభివృద్ధి చేసిందని సీఎస్ కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ప్లాంట్​ను ఆధునికీకరించినట్లు చెప్పుకొచ్చారు. అందుబాటులోకి రానున్న ఆక్సిజన్​తో రాష్ట్రంలో కొంత వరకు ఆ కొరత తీరుతుందన్నారు.

ఇదీ చదవండి:రెండో డోసు కోసం టీకా కేంద్రాలకు పోటెత్తిన లబ్ధిదారులు!

ABOUT THE AUTHOR

...view details