ETV Bharat / state
పంట పొలాల్లోకి మొసళ్లు.. భయాందోళనలో అన్నదాతలు
పంట పొలాల్లో మొసళ్లతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం షాపూర్లో వ్యవసాయ భూముల్లోకి మొసళ్లు రావడం వల్ల బిక్కుబిక్కుమంటూ పనులు చేసుకుంటున్నారు.
పంట పొలాల్లోకి ముసళ్లు
By
Published : Mar 28, 2019, 1:51 AM IST
| Updated : Mar 28, 2019, 3:15 PM IST
మంజీర నదిలో నీరు పూర్తిగా ఎండిపోవడం వల్ల మొసళ్లు పంట పొలాల్లోకి వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం షాపూర్లో మంజీర నది నుంచి వచ్చిన ఓ మొసలి నీళ్లులేని వ్యవసాయ బావిలో పడింది. గుర్తించిన రైతులు అటవీ, వన్యప్రాణి విభాగం అధికారులకు సమాచారం ఇచ్చారు. బావి వద్దకు అధికారులు చేరుకుని తాళ్ల సాయంతో మొసలిని అతి కష్టం మీద బయటకు తీశారు. మంజీర ప్రాజెక్టులో వదలనున్నట్లు తెలిపారు. ఈనెల 24న ఇదే మండలంలోని ఖాన్‌జమాల్‌పూర్, పుల్కల్ మండలం పెద్దరెడ్డిపేటలో గ్రామంలోకి వచ్చిన మొసళ్లను అధికారులు బంధించారు. Last Updated : Mar 28, 2019, 3:15 PM IST