తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షానికి తడిసి ముద్దయిన మొక్కజొన్న

తూకం కోసం కుప్పలు పోసిన మక్కలు... ఈరోజు తెల్లవారు జామున వచ్చిన వర్షానికి తడిసి ముద్దయ్యాయి. సంగారెడ్డి జిల్లా తడ్కల్​ కొనుగోలు కేంద్రంలోని మక్కలు తడవడానికి అధికారుల అలసత్వమే కారణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

corn bags soaked due to heavy rain in thadkal
అకాల వర్షానికి తడిసిముద్దయిన మొక్కజొన్న కుప్పలు

By

Published : Jun 3, 2020, 2:43 PM IST

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్​లో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని మొక్కజొన్న కుప్పలు తడిసిపోయాయి. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన మక్కలు తూకం కాకపోవటం వల్ల రైతులు అక్కడే కుప్పలుగా ఏర్పాటు చేశారు. ఈరోజు తెల్లవారుజామున కురిసిన వర్షాలకు కుప్పలన్నీ తడిసిముద్దయ్యాయి.

తమ మక్కలు తడవడాని అధికారుల అలసత్వమే కారణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దళారుల దగ్గర్నుంచి మక్కలను సకాలంలో కొనుగోలు చేసి తమవి వెనుకపడేశారని ఆరోపించారు. దళారుల మక్కలు భద్రంగా గోదాముల్లో ఉంచి తమవి మాత్రం తడిసినా ఎవరు పట్టించుకోవట్లేదని వాపోయారు. తడిసిన మక్కలు సైతం తూకం చేసి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:సింగరేణిలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details