సంగారెడ్డిలో గాంధీ విగ్రహంతో పాటు నెహ్రూ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. సంగారెడ్డిలో 60 ఫీట్ల నెహ్రూ విగ్రహాన్ని పెడుతున్నట్లు పేర్కొన్నారు. నీళ్లు, విద్యుత్ లేని రోజుల్లోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి గాంధీ ఆలోచనలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేశారని పేర్కొన్నారు.
'పీసీసీ మర్పు అవసరం లేదు.. తప్పనిసరైతే నాకే ఇవ్వాలి' - jaggareddy on nehru statue
పీసీసీ అధ్యక్షపదవి మార్పుపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఇప్పట్లో మార్పులు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మార్పు తప్పదు అనుకుంటే తనకే అవకాశం ఇవ్వాలని తెలిపారు. సంగారెడ్డిలో 60 ఫీట్ల నెహ్రూ విగ్రహాన్ని పెడుతున్నట్లు పేర్కొన్నారు.
jaggareddy
ఇప్పట్లో పీసీసీ చీఫ్‌ను తొలగించాల్సిన అవసరంలేదని... ఉత్తమ్‌ను కొనసాగించాలని కోరుతానన్నారు. మార్పు తప్పదు అంటే తనకే అవకాశం ఇవ్వాలని తెలిపారు.
ఇదీ చూడండి:నేను ఆ మాటపైనే కట్టుబడి ఉంటా: జగ్గారెడ్డి