సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఓ ఆర్టీసీ కండక్టర్ వినూత్నరీతిలో నిరసన తెలిపాడు. స్థానిక డిపోలో కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సాయిబాబా మహాత్మగాంధీ వేషధారణతో నిరసన వ్యక్తం చేశాడు. కార్మికులను చర్చలకు ఆహ్వానించి.. తమ సమస్యలను పరిష్కరించి సమ్మె విరమింపజేయలని కోరాడు. ద్విచక్రవాహనానికి ప్లకార్డు ఏర్పాటు చేసి ధర్నాలో పాల్గొన్నాడు.
జహీరాబాద్లో కండక్టర్ గాంధీగిరి - జహీరాబాద్ ఆర్టీసీ సమ్మె
ఆర్టీసీ సమ్మెలో భాగంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఓ ఆర్టీసీ కండక్టర్ గాంధీగిరి ప్రదర్శించాడు. కండక్టర్ సాయిబాబా మహాత్మగాంధీ వేషధారణతో నిరసన వ్యక్తం చేశాడు.
కండక్టర్ గాంధీగిరి