సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పీఎస్ఆర్ గార్డెన్స్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులకు 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక అమలుపై కలెక్టర్ హనుమంతరావు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 30రోజుల కార్యాచరణలో విధుల పట్ల ఎక్కడ నిర్లక్ష్యం వహించొద్దని.. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఒక్కో కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 1,605 కేటాయించిందని.. అందరూ సక్రమంగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామపంచాయతీల 30 రోజుల కార్యాచరణ పూర్తైన తర్వాత 100 టాస్క్‌ఫోర్స్ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తాయని పేర్కొన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలే... - పీఎస్ఆర్ గార్డెన్స్
30రోజుల గ్రామపంచాయతీ కార్యాచరణలో విధుల పట్ల ఎక్కడ నిర్లక్ష్యం వహించొద్దని.. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు.
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలే...