ముఖ్యమంత్రి కేసీఆర్... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామ రైతు నల్ల నాగిరెడ్డికి ఫోన్ చేసి సంభాషించారు. ఆలుగడ్డ సాగుపై శుక్రవారం సాయంత్రం రైతు నాగిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. జహీరాబాద్ ప్రాంతంలో ఎన్ని ఎకరాల్లో రైతులు అలుగడ్డ సాగు చేస్తున్నారు? విత్తన రకం, దిగుబడిపై రైతుతో సీఎం మాట్లాడారు.
కేసీఆర్ ఫోన్: నాగిరెడ్డి పంటెట్టున్నది... విత్తనాలు ఎక్కడ తెచ్చినవ్!
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోలు రైతుతో సీఎం కేసీఆర్ సంభాషించారు. ఆలుగడ్డ సాగు, విత్తన రకాలు, దిగుబడి గురించి సీఎం తెలుసుకున్నారు. పంటకు సంబంధించిన వివరాలను రైతు నాగిరెడ్డి సీఎంకు వివరించారు.
రంజోల్ రైతుతో మాట్లాడిన సీఎం కేసీఆర్
విత్తనాలు ఎక్కడ నుంచి తీసుకొస్తారు? ఒక్కొక్క మొక్కకు ఎన్ని గడ్డలు ఊరుతాయి? బరువు ఎంత వరకు ఉంటుందని సీఎం అడగగా... వన్ వన్ సిక్స్ పోకే రాజు ఒక రకం పంట వేస్తామని రైతు నాగిరెడ్డి వివరించారు. త్వరలోనే ఆ ప్రాంతంలో పర్యటిస్తానని సీఎం తెలిపారు.
ఇదీచదవండి:ఆస్ట్రేలియాలో తెలంగాణ యువతి దుర్మరణం
Last Updated : Jan 2, 2021, 4:13 PM IST