ఆధునిక జీవనవిధానంలో పట్టణాల్లో పెరగుతున్న చిన్నారుల్లో చాలా మందికి వ్యవసాయంపై కనీస అవగాహన లేదు. తాము తినే ఆహారం ఎలా వస్తుంది.. ఎక్కడి నుంచి వస్తుంది అన్న కనీస అంశాలు కూడా తెలియకుండా పెరుగుతున్నారు. నిత్యం ఉరుకుల పరుగుల జీవితం.. పని ఒత్తిళ్లలో పట్టణాల్లోని పెద్దలూ పొలాల్లో అడుగు పెట్టి ఏళ్లు గడుస్తోంది. కొంత మంది తమ జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి.. పిల్లలకు వ్యవసాయం అంటే ఎంటో చూపించడానికి పొలం బాట పట్టారు. సంగారెడ్డి జిల్లా మాచనూర్ గ్రామంలో ఉన్న పొలాలకు వచ్చారు.
ఎడ్ల బండి ఎక్కి సందడి చేశారు
చిన్నా.. పెద్ద అన్న తేడా లేకుండా పొలాల్లో కలియ తిరిగారు. వివిధ రకాల పంటల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి పొలాల్లో కొంత సేపు పని చేశారు. ఎడ్ల బండి ఎక్కి సందడి చేశారు. పచ్చటి పైర్లతో ఉన్న ప్రకృతిని చూసి పులకరించిపోయారు.