తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్రప్రభుత్వం.. కార్మికుల వ్యతిరేకి : సీఐటీయూ - సీఐటీయూ నాయకులు

కార్మికులపై కేంద్ర  ప్రభుత్వం అమలుచేయాలనుకుంటున్న చట్టాలు వారి హక్కులను హరించేలా ఉన్నాయని సీఐటీయూ నాయకులు విమర్శించారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు సీఐటీయూ నాయకులు ధర్నా నిర్వహించారు.

CITU Oppose Central Government Labor Policies
కేంద్రప్రభుత్వం.. కార్మికుల వ్యతిరేకి : సీఐటీయూ

By

Published : May 22, 2020, 5:26 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక విధానాలను వ్యతిరేకిస్తూ సంగారెడ్డి కలెక్టరేట్​ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలోధర్నా నిర్వహించారు. కార్మికులను ఆదుకోవాల్సిన సమయంలో వారిని ఇబ్బందులకు గురిచేసే చర్యలు సరికాదని సీఐటీయూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను నాశనం చేస్తూ.. వారి హక్కులను కాలరాస్తున్నారని అన్నారు.

లాక్​డౌన్​ సమయంలో కార్మికులకు వేతనాలు ఇవ్వని యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పనిగంటలు పెంచి కార్మికులను కష్టపెట్టే చర్యలు మానుకోవాలని హితవు పలికారు. కార్మికులకు అన్యాయం జరిగితే ప్రత్యేక కార్యాచరణ రూపొందించి కార్మికోద్యమం చేపడుతామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: పెళ్లికొచ్చిన బంధువులు నెల రోజులుగా టెంట్ల కిందే!

ABOUT THE AUTHOR

...view details