సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని గారిడేగామ శివారులో ఓ వ్యక్తి చెరుకులో అంతరపంటగా గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. సమాచారమందుకున్న నారాయణఖేడ్ ఆబ్కారీ పోలీసులు.. సీఐ మహేశ్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. 4556 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. వాటి విలువ దాదాపు రూ. 2 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. తనిఖీల్లో 30 మంది ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
చెరుకు పంటలో గంజాయి పెంచుతూ దొరికిపోయాడు.. - చెరుకులో గంజాయి పెంచుతూ దొరికిపోయాడు..
ఓ వ్యక్తి చెరుకు పంటలో గంజాయి పెంచుతూ ఎక్సైజ్ పోలీసులకు దొరికిపోయాడు. సంగారెడ్డి జిల్లా గారిడేగామలో ఆబ్కారీ పోలీసులు దాడులు చేసి గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు.
![చెరుకు పంటలో గంజాయి పెంచుతూ దొరికిపోయాడు..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4630070-thumbnail-3x2-ganja.jpg)
గంజాయిని ధ్వంసం చేస్తున్న ఎక్సైజ్ సిబ్బంది
చెరుకులో గంజాయి పెంచుతూ దొరికిపోయాడు..
TAGGED:
ఎక్సైజ్ పోలీసులు