సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆర్టీసీ బంద్ సంపూర్ణంగా సాగింది. కార్మికుల బంద్కు రాజకీయ పార్టీలు సహా వామపక్ష నాయకులు మద్దతు పలుకుతూ భారీ నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. భాజపా, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, ఎమ్మార్పీఎస్, ఏఐటీయూసీ నాయకులు పార్టీల జెండాల పట్టుకొని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేపట్టారు. దుకాణాలు తెరిచేందుకు యజమానులను అడ్డుకొని బంద్ పాటించాలని దుకాణాలను మూయించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జహీరాబాద్ డీఎస్పీ గణపతి జాదవ్ నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జహీరాబాద్లో సంపూర్ణంగా సాగిన బంద్ - tsrtc bundh
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆర్టీసీ బంద్ సంపూర్ణంగా సాగింది. బంద్కు రాజకీయ పార్టీలన్నీ మద్దతు పలికాయి.
జహీరాబాద్లో సంపూర్ణంగా కొనసాగుతున్న బంద్