తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్​ఆర్​ఎస్​ను​ రద్దు చేయాలని సంగారెడ్డిలో భాజపా ఆందోళన

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్​ఆర్​ఎస్ విధానాన్ని​ రద్దు చేయాలని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో మూడు గంటల పాటు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఆరోపిస్తూ ప్రభుత్వానికి పిండం పెట్టి నిరసన తెలిపారు. ప్రజలను దోచుకోవడానికి ప్రవేశపెట్టిన ఎల్​ఆర్​ఎస్ పద్ధతిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

By

Published : Oct 3, 2020, 5:24 PM IST

BJP Protest Against LRS IN Sangareddy
ఎల్​ఆర్​ఎస్​కు వ్యతిరేకంగా సంగారెడ్డిలో భాజపా దీక్ష

ఎల్​ఆర్​ఎస్​ రద్దు చేయాలని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. భాజపా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో భాజపా నాయకులు దాదాపు 3 గంటల పాటు నిరసనకు దిగారు. కేసీఆర్​ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని నినాదాలు చేస్తూ.. ప్రభుత్వానికి పిండం పెట్టారు. ప్రజలను దోచుకోవడానికి ప్రవేశపెట్టిన ఎల్​ఆర్​ఎస్​ను వెంటనే రద్దు చేయాలని భాజపా నాయకులు డిమాండ్​ చేశారు.

కరోనా, లాక్​డౌన్​ సమయంలో ప్రజలంతా ఉపాధి కోల్పోయి.. చేతిలో డబ్బులు లేక నష్టాల్లో కూరుకుపోయి ఉన్న సమయంలో.. ఎల్​ఆర్​ఎస్​ అంటూ ప్రజలను పీడించే కార్యక్రమాలు చేపట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి ప్రజలను ఇబ్బందులు పెట్టడం న్యాయమా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు తీర్చాల్సింది పోయి.. ప్రజలను దోచుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీచూడండి:'ఆరోగ్య శ్రీ బలోపేతం... లీకేజీలను అరికట్టడానికి కమిటీ'

ABOUT THE AUTHOR

...view details