సంగారెడ్డిలో భాజపా శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడానికొచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్ వాహనాన్ని అడ్డుకున్నారంటూ ఆరోపించారు. ర్యాలీ సందర్భంగా కొత్త బస్టాండ్ సమీపంలో ట్రాఫిక్ స్తంభించింది. రాజాసింగ్, కార్యకర్తల వాహన వాహన శ్రేణి నిలిచిపోయింది. ఎమ్మెల్యే రాజాసింగ్ హుటాహుటిన ప్రచార రథం దిగి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేని మాట్లాడినివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ భాజపా శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. పోలీసులు సర్ది చెప్పి.. నిరసన విరమింపజేశారు. అనంతరం రాజాసింగ్ లేకుండానే.. ర్యాలీ నిర్వహించారు.
సంగారెడ్డిలో భాజపా శ్రేణుల నిరసన - BJP activists protest at sangareddy
సంగారెడ్డిలో భాజపా ఎన్నికల ప్రచార ర్యాలీ సందర్భంగా కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్.. పార్టీ శ్రేణులతో కలిసి భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడం వల్ల ఎమ్మెల్యే మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
సంగారెడ్డిలో భాజపా శ్రేణుల నిరసన