తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇద్దరు దొంగల అరెస్టు.. 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం - THEFT

జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు దొంగల అరెస్టు.. 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

By

Published : Oct 15, 2019, 7:39 PM IST

Updated : Oct 15, 2019, 9:07 PM IST

జల్సాలకు అలవాటు పడి గత సంవత్సర కాలంగా ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్న ఇద్దరు దొంగలను సంగారెడ్డి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఆందోల్ మండలానికి చెందిన రాము, మల్లికార్జున్​లను పోలీసులు అరెస్టు చేశారు. అమాయకులను ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. సంగారెడ్డి స్టేషన్ పరిధిలో 18, రూరల్ పరిధిలో 1, కూకట్ పల్లి పరిధిలో ఒక ద్విచక్రవాహనం దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. ఇరువురికి గతంలో ఎలాంటి నేరారోపణలు లేవని.. త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు.

ఇద్దరు దొంగల అరెస్టు.. 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
Last Updated : Oct 15, 2019, 9:07 PM IST

ABOUT THE AUTHOR

...view details