సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఓ బాలింత మృతి చెందింది. బాలింత మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ.. ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు, బంధువులు నిరసన వ్యక్తం చేశారు. పుల్కల్ మండలం లక్ష్మీ సాగర్ గ్రామానికి చెందిన రత్నమ్మ మొదటి కాన్పుకై శనివారం సంగారెడ్డికి వచ్చింది. ఇవాళ ఉదయం మగబిడ్డకు జన్మనిచ్చిన రత్నమ్మ.. కొద్దిసేపటి తర్వాత రక్తస్రావం అధికమై మృతి చెందినట్లు వైద్యురాలు గాయత్రి తెలిపారు. ఎలాంటి సమస్యలు లేకుండా వచ్చిన తన భార్యను.. వైద్యులు నిర్లక్ష్యం చేసి చంపేశారని రత్నమ్మ భర్త నర్సింహులు ఆరోపించారు. తమకు న్యాయం జరిపించాలని ఆందోళన వ్యక్తం చేశారు.
సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ బాలింత మృతి
ఓ బాలింత మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చోటు చేసుకుంది. తన భార్య మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి భర్త ఆసుపత్రి ముందు నిరసన వ్యక్తం చేశారు.
సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ బాలింత మృతి