సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఎనికేపల్లి గ్రామ శివారులో 5 ఆవులు ప్లాస్టిక్ పదార్థాలు తిని మృత్యువాత పడ్డాయి. ఈ ఆవులన్ని ఆశ్రితాబాద్ గ్రామానికి చెందిన సయ్యద్ సబుద్దికి చెందినవిగా గుర్తించారు. ఆవులు మరణించడం పట్ల ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. తమ గ్రామ శివారులో సదాశివపేట పట్టణానికి సంబంధించిన డంపింగ్ యార్డు ఉందని.. దాంట్లో ప్లాస్టిక్ పదార్థాలు తిని ఆవులు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.
ప్లాస్టిక్ పదార్థాలు తిని ఐదు ఆవులు మృతి
ప్లాస్టిక్ పదార్థాలు తిని ఐదు ఆవులు మృత్యువాత పడిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లా ఎనికేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
ప్లాస్టిక్ పదార్థాలు తిని ఐదు ఆవులు మృతి