సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఆశాకో పరిశ్రమ కార్మికులు సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. పరిశ్రమ నుంచి మండల కేంద్ర కార్యాలయం ముందు వరకు ర్యాలీ చేసి కార్మికుల కుటుంబాలతో కలిసి తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. మా నాన్నలకు జీతాలు ఇవ్వండి అని కార్మికుల పిల్లలు నినాదాలు చేశారు.
మా డాడీలకు పూర్తి జీతాలివ్వండి: ఆశాకో పరిశ్రమ కార్మికుల పిల్లలు - sangareddy latest news
మా డాడీలకు పూర్తి జీతాలివ్వండి అంటూ ఆశాకో పరిశ్రమ కార్మికుల చిన్నారులు సంగారెడ్డి జిల్లా కందిమండల తహసీల్దార్ కార్యలయం ఎదుట నినాదాలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి కార్మికులు సీపీఎం ఆధ్వర్యంలో యాజమాన్యం తమ పూర్తి వేతనాలు చెల్లించాలంటూ పాదయాత్ర నిర్వహించారు.
మా డాడీలకు పూర్తి జీతాలివ్వండి: ఆశాకో పరిశ్రమ కార్మికుల పిల్లలు
పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులను కరోనాను అడ్డం పెట్టుకుని అక్రమంగా లేఆఫ్ ఇచ్చారని సీపీఎం నాయకులు మండిపడ్డారు. కార్మికులకు పూర్తి జీతాలు చెల్లించాలని చెప్పిన చెల్లించకుండా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందన్నారు. కరోనా కష్ట కాలంలో యాజమాన్యం కార్మికులకు అండగా ఉండాల్సింది పోయి కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడటం సరికాదని ఆరోపించారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించాలని కార్మికులకు పూర్తి జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.